తెలంగాణ రాష్ట్రానికి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్ గడ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి గాలులతో పాటు కర్నాటకపై 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివాం నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోఅక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఎల్లో అలర్ట్ జారీచేసిన ఐఎండీ.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. అయితే.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. మరోవైపు శుక్రవారం వికారాబాద్, రంగారెడ్డి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అప్పటి కప్పుడు ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాల వల్ల గంటల వ్యవధిలోనే కుంభ వృష్టి కురుస్తోంది.