సూర్యకిరణాలు శృంగార కోరికలను పెంచుతాయా? ఇజ్రాయెల్ అధ్యయనం ఏం చెబుతుంది? 

-

వేసవి కాలంలో సూర్యకిరణాలు చర్మంపై పడినపుడు వాటిద్వారా శృంగార కోరికలు పెరుగుతాయా అనే విశయమై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనలు సూర్యకిరణాలు శృంగార కోరికలను పెంచుతున్నాయని చూపిస్తున్నాయి. సూర్యకిరణాలు శరీరాన్ని తాకినపుడు ప్రేమ తాలూకు కోరికలు పెరిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం టెల్ అవీన్ విశ్వ విద్యాలయంలోని ఒక బృందం చేపట్టిన పరిశోధనలు ఈ విధంగా ఉన్నాయి.

చర్మంలో ఉండే ప్రోటీన్ కారణంగా సూర్యకాంతి వల్ల చర్మ డీఎన్ఏ దెబ్బతినకుండా ఉంటుంది. ఐతే సూర్యకాంతి పడినపుడు p53-హార్మోన్ల వల్ల శరీరంలో, మనస్సులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది జంతువులలో సెక్స్ ను ప్రేరేపిస్తుంది. అలాగే మనుషులలో ప్రేమ మూడ్ ని తీసుకురావడంలో సాయపడుతుంది.

మానవ మాలిక్యులర్ జెనెటిక్స్ మరియు బయోకెమిస్ట్రీ విభాగం ప్రొ. ప్రొఫెసర్ కార్మిట్ లెవీ మాట్లాడిన దాని ప్రకారం, మా ల్యాబ్ చర్మ క్యాన్సర్ ను అధ్యయనం చేస్తుంది. ఐతే అనుకోకుండా వచ్చిన ఫలితాలలో సూర్యకిరణాల వల్ల లైంగిక కోరికలు ప్రభావితం అవుతాయనే విషయాన్ని కనుగొన్నామని చెప్పారు. ఇది శృంగార కోరికలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మొదలుకుని, సూర్యకాంతి పడిన తర్వాత రక్తంలో వచ్చే అనేక మార్పులను కనుగొన్నామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version