ఇలా చేస్తే మీ బద్ధకానికి స్వస్తి చెప్పవచ్చు…!

-

సాధారణంగా చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన క్షణం నుంచి కూడా బద్ధకంగా ఉంటారు. చురుకుదనం, ఉల్లాసం, ఉత్సాహం వంటివి ఏమీ ఉండకుండా ఎప్పుడు చూసినా బద్ధకంగా ఏ పని చేయకుండా ఉంటారు. అతిగా నిద్ర పోవడం, ఏ పని చేయకపోవడం వంటివి చేస్తూ ఉంటారు ఒక్కసారి బద్ధకాన్ని పక్కన పెడితే ఎన్నో పనులు చేసుకోవచ్చు. అయితే బద్ధకానికి స్వస్తి చెప్పాలి అంటే ఏం చేయాలి…? ఈ విషయం లోకి వస్తే బద్ధకానికి ఎంతో సులువుగా కొన్ని పద్ధతుల్ని అనుసరించి స్వస్తి చెప్పేయొచ్చు. ఆ పద్ధతులు ఇవే…!

అన్ని విషయాలు మర్చిపోండి:

రాత్రి నిద్ర పోయేటప్పుడు ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోండి. ఉదయాన్నే నిద్ర లేచాక పనులు కోసం ఆలోచించచ్చు. ప్రశాంతంగా మొదట నిద్ర పోవడం వల్ల ఉదయాన్నే లేచి పనులు చేసుకోవడానికి వీలు అవుతుంది. కాబట్టి రాత్రి డిన్నర్ చేసి టీవీ, సెల్ ఫోన్ లకి దూరంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోండి.

వ్యాయామం చేయడం:

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాసేపు న్యూస్ పేపర్ చదవడం లాంటివి చేయండి. ఆ తర్వాత వ్యాయామం లేదా మెడిటేషన్ చేయండి. ఇలా చేయడం వల్ల చురుగ్గా ఉల్లాసంగా ఉండగలరు. వ్యాయామం వల్ల మీలో శక్తి, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. వ్యాయామం చేసిన కొన్ని గంటల తర్వాత శరీర ఉష్ణోగ్రత, అడ్రినలిన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మీరు ఉత్సాహంగా ఉండొచ్చు.

బ్రేక్ఫాస్ట్ మానొద్దు:

చాలా మంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ స్క్రిప్ట్ చేస్తారు. అలా చేయొద్దు. రాత్రి పడుకున్నప్పుడు మెటబాలిజమ్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని పునరుత్తేజం చేయడం చాలా అవసరం. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీరు తప్పకుండా బద్దకానికి స్వస్తి చెప్పవచ్చు. దీనితో మీరు ఎప్పటికప్పుడు మీ పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news