టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసులు మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆయనపై దాదాపు 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో బెయిల్ వచ్చినా మరికొన్ని కేసుల్లో బెయిల్ రాలేదు.. దాంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దెందులూరు, పెదవేగి, పెదపాడు పీఎస్‌లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
పీటీ వారెంట్‌పై చింతమనేనిని పోలీసులు ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు నవంబర్ 20వ తేదీ వరకు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. పలు పాత కేసుల్లో ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించినట్లు తెలిసింది.