అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్‌కు విచ్చేస్తున్నారు. గతంలో భారత్‌ను తిట్టిపోసిన ఆయన ఇప్పుడు అదే భారతీయులపై ప్రమేను ఒలకబోస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి భారత్‌కు వచ్చేస్తుండడం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిగా మారింది. అనేక ఒప్పందాలు, చర్చలు ఈ పర్యటనలో ఉండనున్నా యి. అయితే, ఆయన పర్యటన ఎలా సాగుతుందనే విషయం కూడా ఆసక్తిగా ఉంది. భారత్‌లో 24, 25 తేదీల్లో పర్యటించే ట్రంప్.. మొత్తంగా మూడు రాష్ట్రాల్లో సందర్శించనున్నారు. గుజరాత్, యూపీ, ఢిల్లీలో సుడిగాలి పర్యటన ఆయన చేయనున్నారు.
24వ తేదీ..
+ వాషింగ్టన్ నుంచి ఆదివారమే బయలుదేరే ట్రంప్.. సోమవారం ఉదయం 11.30 గంటలకు నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంటారు.
+ అక్కడి నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమం(గాంధీ) చేరుకుంటారు.
+ మధ్యాహ్నం 1గంటలకు ఆసియాలోనే రెండో అతిపెద్ద స్టేడియం అయిన మొతేరా స్టేడియంకు చేరుకుని ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకుంటారు. ఈ కార్యక్రమంలోనే దాదాపు లక్షల మంది ప్రజలు ఆయనకు ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
+ అనంతరం అక్కడే భోజనం చేసి.. అక్కడ నుంచి ఆగ్రా చేరుకుంటారు.
+ సాయంత్రం 5.30 నుంచి తాజమహల్ పర్యటనలో పాల్గొంటారు. పాలరాతి కట్టడాన్ని వీక్షిస్తారు.
+ దాదాపు గంట సేపు తాజ్‌మహల్ వద్దే ఉండే ట్రంప్ పరివారం అనంతరం ఢిల్లీ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.
25వ తారీకు..
+ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్‌కు భారీ స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.
+ అనంతరం మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు.
+ ఉదయం 11 గంటల నుంచి ప్రధాని మోడీ, ట్రంప్‌ల మధ్య వివిధ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం ఉంటుంది
+ 12.30 తర్వాత జాతీయ, అంతర్జాతీయ మీడియాతో మోడీ, ట్రంప్‌లు సంయుక్తంగా సమావేశం ఉంటుంది.
+ అనంతరం విడిది ప్రాంతానికి చేరుకుని అక్కడే భోజనం, విశ్రాంతి తీసుకుంటారు.
+ రాత్రి 7.30 గంటలకు తిరిగి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.
+ రాష్ట్రపతి ఇచ్చే భారీ విందులో ట్రంప్ పాల్గొననున్నారు.
+ అనంతరం రాష్ట్రపతితోనూ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమవుతారు.
+ అన్ని కార్యక్రమాలూ ముగించుకుని రాత్రి పది గంటలకు అమెరికాకు తిరుగు పయనమవుతారు.
ట్రంప్ సతీమణి ప్రత్యేక పర్యటన షెడ్యూల్ ఇదీ..
+ అగ్రరాజ్య అధినేత ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆమె ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తొలి రోజు పర్యటనలో మెలానియా కోరిక మేరకు ట్రంప్ కూడా ప్రేమ సౌధం తాజ్‌మహల్ పర్యటనకు వెళ్లనున్నారు.
+ రెండోరోజు మంగళవారం.. ట్రంప్ అధికారిక కార్యక్రమాల్లో ఉంటారు. అయితే, మెలానియా మాత్రం ఢిల్లీలో పర్యటిస్తారు. కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకువచ్చిన నూతన విద్యా విధానంపై ఆమె అధ్యయనం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిన విధానాన్ని ఆమె ప్రత్యేకంగా పరిశీలిస్తారు. దాదాపు పది పాఠశాలలో మెలానియా పర్యటన ఉండనుంది.