ఏపీ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం..

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు అయితే ఆగడం లేదు. అయితే రానున్నది శీతాకాలం కావడంతో వాహన చోదకులు మరింత జాగ్రత్టగా నడపాల్సి ఉంటుంది. మంచు కారణంగా ముందు వచ్చే వాహనాలు కూడా ఈ సీజన్ లో కనిపించవు, దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికంగా ఉంటుంది. తాజాగా యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీ గూడెం గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ మార్గంలో రోడ్డు పక్కన స్కూటీ ఆపి జర్కీన్ వేసుకుంటున్న యువకుడిని ఆల్టో కారు ఢీకొట్టగా, ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి కుమారుడు షారుక్ గా గుర్తించారు. మస్తాన్ వలి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు. దీంతో ఏపీ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది.