ట్రంప్ కొడుక్కి కరోనా పాజిటివ్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవట. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. “ఆయనకు ఈ వారం మొదట్లో పాజిటివ్ అని తేలింది. ఈ ఫలితం వచ్చిన నాటి నుండి ఆయన తన క్యాబిన్ లో నిర్బంధంలో ఉన్నాడు” అని ప్రతినిధి చెప్పారు.

“ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా సరే వైద్యపరంగా సిఫార్సు చేయబడిన అన్ని COVID-19 మార్గదర్శకాలని అనుసరిస్తున్నాడు” అని ఆ ప్రతినిధి చెప్పారు. ఇక గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు, ఆయన భార్య మెలానియాకి కూడా కరోనా సోకింది. వీరిద్దరికీ కాక ట్రంప్ మరో కుమారుడు బారన్‌ ట్రంప్‌ కు కూడా గతంలో కరోనా సోకినట్లు సమాచారం, ట్రంప్ ఆయన భార్యకు కరోనా సోకినప్పుడు ఈయనకు కూడా కరోనా సోకింది. అయితే కరోనా వచ్చినా, అదృష్టవశాత్తు పద్నాలుగేళ్ల బారెన్‌కు ఎలాంటి లక్షణాలు లేవని అప్పట్లో ప్రకటించారు.