ఒక్కోసారి మనకి ఇతరులు చేసే పనిలు నచ్చవు అయితే వాళ్లు చేసే పనులు నచ్చక పోతే మనం అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెబుతూ ఉంటాము. నిజానికి ఇలా చెప్పడం వల్ల వాళ్లని మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉండే పిల్లలుకి కానీ భార్యకి కానీ భర్త కి కానీ ఇలా ఎవరికైనా మనం వారు చేసే పనిని నచ్చకపోతే చెప్తూ ఉంటాము.
పైగా వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాము. పిల్లలని అయితే రెండు కొట్టో లేదంటే తిట్టొ వాళ్లని మార్చాలని చూస్తూ ఉంటాము కానీ నిజానికి అందరూ చెప్పిన వెంటనే మారిపోరు. మీరు పదే పదే వద్దని చెబుతున్నా కొందరు వాటినే రిపీట్ చేస్తూ ఉంటారు దీనివలన చెప్పి చెప్పి మనకు కూడా విసుగు వస్తుంది. అయితే ఒకసారి వాళ్ళు కనుక మారకపోతే మీరు అనవసరంగా స్ట్రెస్ తీసుకోకండి. వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే మీరు చెప్పడం మానేయండి.
లేదంటే మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు ఏమో అని ఒక సారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే పోయేదేముంది..? కాబట్టి అనవసరంగా మీరు చెప్పి చెప్పి టైం వేస్ట్ చేసుకోకండి వీలైనంత వరకూ వాళ్ళ జోలికి మీకు నచ్చని పని కి దూరంగా ఉండండి. దీని వలన మీకు ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు చేసే పని ఇష్టం లేకపోతే మీరు ఆ పని చేస్తున్న సమయంలో వారికి దూరంగా ఉండండి.
ఎప్పుడూ కూడా ఇతరులు మీరు చెప్పేది వినడం లేదని వారిపై కోప్పడ్డం పగ పెంచుకోవడం వంటివి చేయకండి దీని వలన మీరు ఎదుటి వాళ్లు కూడా బాధపడాల్సి వస్తుంది వాళ్లకి కరెక్ట్ గానే ఉంటుంది కాబట్టి మీరే తప్పు అని వారు భావిస్తారు. కాబట్టి ఆ సందర్భాన్ని మీరు పక్కకు తోసేసి ముందుకు వెళ్లి పోయి హ్యాపీగా ఉండండి లేదంటే ప్రశాంతంగా ఉండడానికి కూడా వీలు అవ్వదు.