స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి..!!

-

కొన్ని కారణాల వల్లో లేక కొత్త ఫోన్ మీద మోజో గానీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను కొనాలని అనుకుంటే మాత్రం దాని ధరపై తగ్గింపును పొందాలనుకుంటే ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకోవచ్చు. మార్కెట్‌ లో వివిధ రకాల కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆన్‌లైన్ కంపెనీలు మంచి స్థితిలో ఉన్న మీ స్మార్ట్‌ ఫోన్‌కి తక్కువ ధరను అంచనా వేస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మంచి ధరని పొందవచ్చు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..


పాతదానికి కొత్తదానిలా ముస్తాబు చెయ్యడం.. అదేనండి క్లీన్ చెయ్యడం.. మీరు స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకునే ముందు దానిని శుభ్రం చేయడం మరచిపోవద్దు. లేదంటే చాలా తక్కువ మొత్తాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డర్టీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉండదు. అందుకే ఎల్లప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ని శుభ్రంగా ఉంచుకోవాలి..

కొన్ని నెలల తర్వాత దాని వెనుక ప్యానెల్‌పై గీతలు పడుతాయి. ఇది జరిగిన తర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్ పాతదిగా కనిపిస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసేటప్పుడు ముందు వెనుక ప్యానెల్‌ను మార్చాలి. అప్పుడు ఫోన్‌ కొత్తదిలా మెరుస్తుంది. పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకునేటప్పుడు దాని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి. ఇది వేగాన్ని పెంచుతుంది. దీనివల్ల మీ ఫోన్‌కు మంచి ధర లభిస్తుంది.. ఇవన్నీ కూడా మీ ఫోన్ మార్చుకొనే ముందు తప్పక చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Latest news