వర్చువల్ డేటింగ్ చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దు

-

కరోనా తర్వాత బంధాలు కూడా స్మార్ట్ ఫోన్ తో ముడిపడిపోయాయి. పక్కన ఉన్నవారు మాట్లాడడానికి భయపడిపోవడంతో ఎక్కడో ఉన్న వారితో స్నేహాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక డేటింగ్ యాప్ ల ద్వారా స్నేహితుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అలా వర్చువల్ డేటింగ్ కొనసాగించడానికి సిద్ధం అవుతున్నారు. ఐతే ఇలాంటి డేటింగ్ చేసేవారు కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. అవి చేయకుండా ఉంటే మీ వర్చువల్ రిలేషన్ షిప్ మరింత గట్టిగా ఉంటుంది.

భద్రత గురించి ఆలోచించకపోవడం

అవతలి వారు మీరు అనుకుంటున్న జెండరేనా కాదా అన్న విషయం తెలియకుండానే అందులోకి దిగిపోయి పూర్తిగ్గా మునిగిపోయి, ఆ తర్వాత మోసపోయి, చేసేదేమీ లేక మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవద్దు. చాలాసార్లు వర్చువల్ డేటింగుల్లో ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువగా కనిపిస్తాయి.

వాస్తవం కానీ చిత్రాలు

ఫోటో ఎడిటింగ్ సులభం అయ్యాక ప్రతీ ఒక్కరూ తమ వాస్తవ రూపాన్ని దాచి పెడుతున్నారు. మార్ఫింగ్ చాలా కామన్ అయిపోయింది. వర్చువల్ డేటింగ్ లో ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే మీకు మెసేజ్ చేసేది ఒకరు, చేస్తున్నారని మీరనుకునేది ఇంకొకరుగా ఉంటుంది. అంతా తెలిసాక మీ మనసు మీద అది గట్టి ప్రభావాని చూపిస్తుంది.

బోర్ కొట్టే మెసేజీలు

డేటింగ్ యాప్ లో ఏదైనా క్రియేటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. బోరింగ్ మేసేజెస్ అసలే వద్దు. లేదంటే అనవసరమైన దాన్ని ఎందుకు తలకెత్తుకున్నామా అని పిస్తుంది.

అబద్ధాలు

మీ గురించి అనవసరమైన అబద్ధాలు చెప్పవద్దు. మీలా మీరుండండి. ఏది పడితే అది వాగి, లేనివి ఆపాదించుకుని, మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవద్దు. అవన్నీ నిజం కాదని ఏదో ఒకరోజు తెలిసిపోతుంది. అలాంటప్పుడు అవతలి వారు నిజాయితీ పరులైతే చాలా బాధపడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news