అలర్ట్: ఈ సిరీస్ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే ఎత్తొద్దు..ఎత్తారా ఇక అంతే !

-

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు బాగా ఎక్కువ పోయాయని చెప్పక తప్పదు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే మనుషులను దారికాచి దొంగతనం చేసేవాళ్ళు.. కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్ళు. ముఖ్యంగా +92, +1, +968, +44తో పాటు +473, +809, +900 సిరీస్‌లతో కూడిన ఫోన్ నంబర్లతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌  రిసీవ్‌ చేసుకుంటే.. మీ ఫోన్ లో ఉన్న మొతం డేటా గల్లంతు కావడం ఖాయమని  సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త సిరీస్‌ ఫోన్‌ నెంబర్ల మోసాలపై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు తాజాగా ఒక వీడియో రూపొందించారు. కొన్ని సిరీస్‌లతో కూడిన నంబర్‌లతో ఫోన్లు చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

అయితే, ప్రజలు ఆ నంబర్‌లు గుర్తించకుండా వారి స్నేహితుల ఫొటోలతో సేవ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌  లోంచి కొన్ని ఫొటోలను సేకరిస్తారు. ఆ తర్వాత ఫేక్ నంబర్‌లను ఆయా వ్యక్తుల ఫొటోలతో సేవ్‌ చేస్తారు. ఆ ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేస్తారు. స్నేహితుడు, స్నేహితురాలి ఫొటోతో ఫోన్‌ రావడంతో సదరు వ్యక్తి నంబర్‌ చూడకుండానే ఫోన్‌ లిఫ్ట్‌ చేసేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి ఫోన్‌లోని సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతోంది. ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేసేటప్పుడు.. అప్రమత్తంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని చెబుతున్నారు. లేదంటే మీ ఫోన్ లో ఉండే ఫోటోలు, వీడియోలు సహా అన్నీ వాళ్ళకు చేరే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త/

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news