యోగా: ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా చేయకూడదో తెలుసుకోండి.

-

భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన వరం యోగా. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ యోగా ప్రాక్టీసు చేస్తున్నాఅయి. ఐతే ప్రతీ దానికీ అవధులు ఉంటాయి. ఏది ఎంత చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో అన్నదానికి పరిమితులు ఉంటాయి. అవి తెలియకపోతే అనేక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యోగాను ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చేయకూడదో తెలుసుకుందాం.

అతిగా చేయవద్దు

ఇక్కడ అతిగా అంతే ఎక్కువ సమయం అని కాదు. ఆసనాలు వేసేటపుడు ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలన్న నెపంతో పట్టుబట్టి చేయవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి స్కేలు మీద ప్రతీదీ 10పాయింట్లు ఉండాలన్న రూల్ లేదు.

వాతావరణం

అతిగా చల్లగా ఉన్న ప్రదేశాలు, అత్యంత వేడిగా ఉన్న ప్రదేశాలు, అతి ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో యోగా చేయవద్దు.

శ్వాస

శ్వాస తీసుకోవడం, వదలడం అనేవి యోగాలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కొన్ని సార్లు శ్వాస తీసుకోవడాన్ని నివారించాల్సి ఉంటుంది. ఇలాంటి టైమ్ లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మీకు శిక్షణ ఇచ్చేవారు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా గమనించండి.

భోజనం తర్వాత యోగా

ఆహారం తిన్న వెంటనే యోగా చేయవద్దు. కనీసం 2-3గంటల వరకు వేరే పనిచేసుకున్నాక గానీ యోగా చేయరాదు.

బాగా అలసిపోయినపుడు వద్దు

బాగా అలసిపోయినపుడు కండరాలన్నీ నొప్పి పెడుతుంటాయి. అలాంటి టైమ్ లో యోగా ప్రాక్టీసు సరైన నిర్ణయం కాదు. కండరాలకు మరింత ఇబ్బంది కలిగించే పని చేయవద్దు.

బిగుతు వస్త్రాలు ధరించవద్దు

మరీ బిగుతుగా ఉండి, శరీరానికి పూర్తిగా అతుక్కుపోయే వస్త్రాలు యోగా చేసేటపుడు ధరించరాదు. దానివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.

స్నానం

యోగా పూర్తవగానే స్నానం చేయవద్దు. చెమట చిందించారు కాబట్టి అది పూర్తిగా ఎండిపోయిన తర్వాతే స్నానానికి వెళ్ళాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version