IBM లో ఉద్యోగాలు…వివరాలు ఇవే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రెషర్లకు ప్రముఖ ఐటీ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (IBM) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.

 

jobs

ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అలానే అప్లికేషన్స్ రూపొదించడం, కోడ్స్ రాయడం, టెస్ట్ చేయడం, డీబగ్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ లాంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పచ్చు. ఫ్రెషర్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.

ఎంపికైన వాళ్లు హైదరాబాద్, ముంబై, పూణె, ఢిల్లీ, గుర్గావ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో బీఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ లాంటి కోర్సులు చదువుతుండాలి. ఎంట్రీ లెవెల్ లేదా ఫ్రెషర్ జాబ్స్ కాబట్టి చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి గమనించండి.

https://www.ibm.com/in-en/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.హోమ్ పేజీలో కెరీర్స్ సెక్షన్ క్లిక్ చేయాలి. అక్కడEntry level/Intern ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పోస్టులు కనిపిస్తాయి. వీటిలో అప్లయ్‌ చేయాలనుకుంటున్న పోస్టు పైన క్లిక్ చెయ్యండి. తర్వాత Entry-level openings పైన క్లిక్ చేయాలి. అంతే దరఖాస్తు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version