దుబాయ్ నుంచి తిరిగొచ్చాక బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ తొలిసారిగా స్పందించారు. ఇటీవల తన తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి వచ్చిన షకీల్‌కు పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆదివారం ఆయన తొలిసారి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియా తనపై దుష్ప్రచారం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలు రాసే ముందు ఆలోచించి రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.. ఇదిలాఉండగా, షకీల్ మళ్లీ పార్టీలో యాక్టివ్ అయినట్లు సమాచారం. గతంలో తన కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు అనంతరం అతను దుబాయ్ వెళ్లినట్లు తెలిసిందే.