విద్యార్థులకు తెలంగాణ విద్యా శాఖ శుభవార్త చెప్పింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్) మొదటి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడగించింది. మొదటి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ను ఈ నెల 24 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు. ఈ నెల 31 న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
మొదటి విడతలో సీట్లు పొందిన వారు ఆగస్ట్ 5 లోపు ఆయా కళాశాలల్లో ఆన్లైన్ రిపోర్ట్ చేయాలని ఆయన వెల్లడించారు. ఆగస్ట్ 1 నుండి 9 వ తేదీ వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందన్నారు కన్వీనర్ లింబాద్రి. ఆగస్ట్ 2 నుండి 9 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ఆగస్ట్ 14 న సీట్ల రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు కానుందన్నారు. ఇక ఈ రోజు వరకు లక్ష 40 వేల 581 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు లక్షా 28 వేల 573 మంది ఫీజు చెల్లించారని.. వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న విద్యార్థులు సంఖ్య 88 వేల 123కు చేరిందన్నారు.