డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

మనం వాహనం మీద వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటివి మనం తీసుకు వెళ్ళక్కర్లేదు. ఈ మధ్య టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కనుక మనం స్మార్ట్‌ఫోన్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసి ట్రాఫిక్ పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు చూపించవచ్చు.

ఏ డాక్యుమెంట్స్ ని మనం తీసుకు వెళ్ళక్కర్లేదు. కానీ వీటిని మీరు పిక్ తీసి చూపించకూడదు. అలా పని చేయవు. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేసి వుంచుకోవచ్చు. అయితే మరి ఎలా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చెయ్యాలి అనేది చూద్దాం. వివరాలలోకి వెళితే.. వాహనదారులు పరివాహన్ సేవా వెబ్‌సైట్, డిజీలాకర్ వెబ్‌సైట్, డిజీలాకర్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరివాహన్ సేవా వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఇలా డౌన్లోడ్ చెయ్యండి:

పరివాహన్ సేవా వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ని పొందడం కోసం పరివాహన్ సేవా వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యండి.
హోమ్ పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ లో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలపై నొక్కండి.
రాష్ట్రం పేరును సెలెక్ట్ చెయ్యండి.
డ్రైవింగ్ లైసెన్స్ విభాగం నుంచి ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్‌ని ఒకే చేసి.. వివరాలను ఎంటర్ చేయాలి.
పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోండి అంతే.

డిజీలాకర్ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఇలా డౌన్లోడ్ చెయ్యండి:

మొదట డిజీలాకర్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
నెక్స్ట్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి లాగిన్ అవ్వండి.
డాక్యుమెంట్స్ సెక్షన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎంచుకోండి.
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ హైవేస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
సెర్చ్ లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చెయ్యండి. తరవాత డౌన్లోడ్ చేసుకోవాలి అంతే.

డిజీలాకర్ వెబ్‌సైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఇలా డౌన్లోడ్ చెయ్యండి:

డిజిలాకర్ వెబ్‌సైట్‌లో మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి.
ఎడమ వైపు సెర్చ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసి..డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్‌ ని ఎంచుకోండి.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖపై క్లిక్ చేయాలి.
సెర్చ్ లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చెయ్యండి. తరవాత డౌన్లోడ్ చేసుకోవాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news