మీ పాన్ కార్డు పోయిందా..? అయితే ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి..!

-

పాన్ కార్డు ప్రతీ ఒక్కరికి అవసరం. బ్యాంక్ అకౌంట్ మొదలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ దాకా మనకి ఇది ఉపయోగ పడుతుంది. భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే పాన్ ఎంతో ముఖ్యం. అయితే ఇంత ముఖ్యమైన పాన్ కార్డుపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..? పాన్ ని తిరిగి ఎలా పొందాలి అనేది మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తి వివరాల లోకి వెళ్ళిపోదాం.

పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సింపుల్‌గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పైగా దీని కోసం ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. ఇంట్లో వుండే ఈజీగా డౌన్లోడ్ చెయ్యచ్చు. ఈజీగా డిజీలాకర్ యాప్‌లో కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. వెబ్ సైట్ ద్వారా ఎలా డౌన్ లోడ్ చెయ్యాలి అనేది చూస్తే..

ముందు TIN-NSDL వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ మీరు Download e-PAN Card ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.
పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలివ్వాలి.
అక్కడ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు, ఇమెయిల్ కి ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేటె పైన క్లిక్ చేయండి అంతే.

డిజీలాకర్ తో ఇలా డౌన్లోడ్ చెయ్యండి:

డిజీలాకర్ యాప్ ఇంస్టాల్ చేసుకుని.. ఆధార్ నెంబర్, ఇతర వివరాలతో లాగిన్ అవ్వాలి.
నెక్స్ట్ మీరు ఇష్యూడ్ డాకుమెంట్స్ పైన క్లిక్ చెయ్యండి.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లోకి వెళ్ళండి.
అక్కడ PAN Card ని సెలెక్ట్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ వంటి డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఉంటుంది.
పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి… Get Document పైన క్లిక్ చేయాలి.
మీ పాన్ కార్డ్ డిజీ లాకర్‌లో issued documents సెక్షన్‌లో స్టోర్ అవుతుంది అంతే.

Read more RELATED
Recommended to you

Latest news