రోగి కోసం బ్యాట్ మ్యాన్ గా మారిన డాక్టర్..!

సాధారణంగా డాక్టర్లు కొన్ని కొన్ని సార్లు రోగుల పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా రోగుల కోరిక తీర్చడానికి సరికొత్త అవతారం ఎత్తుతూ ఉంటారు డాక్టర్లు. ఇక్కడ ఓ డాక్టర్ ఇదే చేసాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారి కోరిక తీర్చేందుకు ఏకంగా బ్యాట్ మ్యాన్ గా మారిపోయాడు డాక్టర్. ఏకంగా వైద్యం చేసే ప్రాణాలను పోయడమే కాదు బ్యాట్ మెన్ అవతారమెత్తి చిన్నారి కోరిక కూడా తీర్చాడు.

ఇటీవలే ఓ చిన్నారి బాలుడు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి వైద్యం అందించి డాక్టర్ ని చివరి కోరిక ఏంటో అని అడగగా అతను వెంటనే బ్యాట్ మాన్ ని కలవడం తన చివరి కోరిక అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సదరు డాక్టర్ బ్యాట్ మాన్ అవతారం ఎత్తాడు. అయితే ఏకంగా బాలుడు ముందు ప్రత్యక్షం అయ్యాడు ఏకంగా బాలుడిని దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు దీంతో ఆ బాలుడు బ్యాడ్ మాన్ ని చూసి ఎంతగానో మురిసిపోయాడు. ఇక బాలుడు కోరిక తీర్చేందుకు డాక్టర్ అంకితభావాన్ని చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.