వివాహేతర సంబంధం.. చివరికి అతన్ని అరెస్టు చేశారు..?

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన హత్య కేసు ఒక్కసారిగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురికావడం స్థానికులు అందరినీ భయాందోళనకు గురి చేసింది. జనగామ కు చెందిన లక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటుంది. కాగా ఆమెకు ఆర్య కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఇటీవలే ఆర్య కుమార్ లక్ష్మీ పై అనుమానం పడటం మొదలు పెట్టాడు. ఇటీవల లక్ష్మీని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆర్య కుమార్ అక్కడ లక్ష్మి తో గొడవ పడ్డాడు ఇక ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిన ఆర్య కుమార్ దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఇక ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఎంతో చాకచక్యంగా నిందితుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.