గ్యాస్ సిలెండర్ నింపిన విషాదం, తల్లి కొడుకు స్పాట్ డెడ్…!

తమిళనాడులోని తిరువన్నమలైలో దారుణ ఘటన జరిగింది. ఆదివారం ఎల్‌పిజి సిలిండర్ పేలిన తరువాత గోడ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 8 ఏళ్ళ బాలుడు, అతని తల్లితో పాటుగా మరొకరు ప్రాణాలు విడవగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో జాయిన్ చేసారు. గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది అని పోలీసులు వెల్లడించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో అద్దెకు ఉండే జె కామచ్చి, ఆమె కుమారుడు జె హేమనాథ్, పొరుగున ఉన్న ఎస్ చంద్ర ప్రాణాలు కోల్పోగా, కామచ్చి భర్త ఎం. జానకిరామన్, మరో కుమారుడు జె సురేష్ (15) తీవ్రంగా గాపడ్డారు. గాయపడిన వారికి 50 శాతం గాయాలు అయ్యాయి అని పోలీసులు వెల్లడించారు. వారిని అరానిలో ప్రాధమిక చికిత్స అనంతరం వెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారికి సిఎం పళని స్వామి రెండు లక్షల సాయం ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల సాయం ప్రకటించారు.