ఏపీలో తగ్గిన మద్యం ధరలు ..ఆనందంతో మందుబాబుల పూజలు…!

ఏపీలో మద్యం ధరలు తగ్గాయి. దాంతో మందు బాబులు ఫుల్ కుషిగా ఉన్నారు. ఆ ఆనందంలో మందుబాబులు పూజలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న మద్యం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం తో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే కొందరు మందు బాబులు ప్రకాశం జిల్లా సింగారయ కొండలో మద్యం దుకాణం వద్ద పూజలు చేశారు. వైన్ షాపులు హారతులు పట్టారు.

అనంతరం కొబ్బరి కాయ కొట్టి మద్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ పూజలకు సంభందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మద్యం ధరలను సర్కార్ 15 నుండి 20 శాతం తగ్గించింది. దాంతో క్వార్టర్ పై రూ.15 నుండి రూ.20 వరకు తగ్గాయి. అంతే కాకుండా ఫుల్ బాటిల్ ల పై రూ.120 వరకు తగ్గాయి. అన్ని రకాల బీర్ల పై రూ.20 నుండి రూ.30 తగ్గాయి. ఎంతో ఏపీ మందుబాబులకు పక్క రాష్ట్రాల నుండి మద్యం అడ్డ దారిలో తీసుకెళ్లే తిప్పలు కూడా తగ్గాయి.