ఢిల్లీలో పాలు, పాల సంబంధత పదార్థాలపై నిర్వహించిన 161 రకాల ఆహార నాణ్యతా ప్రమాణాల పరీక్షల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఢిల్లీలో అమ్ముడయ్యే పాలు లేదా పాలు సంబంధత పదార్థాల్లో అస్సలు ఏమాత్రం పోషకాలు ఉండడం లేదట.
పాలలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. పాలు సంపూర్ణ పౌష్టికాహారాల జాబితా కిందకు వస్తాయి. అందుకనే చాలా మంది పాలు తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న కల్తీ యుగంలో మనకు అసలైన పాలు లభించడం లేదు. లేదా దొరికే పాలలోనే నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి. హానికరమైన రసాయనాలు ఉండడమో, పోషక పదార్థాలు లేకపోవడమో, కల్తీ అవడమో జరుగుతోంది. ఈ క్రమంలో మనకు నాణ్యమైన పాలు లభించడం లేదు. అయితే పాల నాణ్యత విషయానికి వస్తే.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏమో గానీ దేశ రాజధానిలో మాత్రం పాలు ఏమాత్రం నాణ్యంగా ఉండడం లేదు. ఈ విషయాన్ని అక్కడి అధికారులే చెబుతున్నారు.
ఢిల్లీలో పాలు, పాల సంబంధత పదార్థాలపై నిర్వహించిన 161 రకాల ఆహార నాణ్యతా ప్రమాణాల పరీక్షల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఢిల్లీలో అమ్ముడయ్యే పాలు లేదా పాలు సంబంధత పదార్థాల్లో అస్సలు ఏమాత్రం పోషకాలు ఉండడం లేదట. చాలా వరకు కల్తీ పాలనే అమ్ముతున్నారట. ఇక కొన్ని కంపెనీలైతే హానికారక రసాయనాలు ఉన్న పాలను విక్రయిస్తున్నాట. ఇక మరికొన్ని కంపెనీలైతే తాగడానికి ఏమాత్రం పనికిరాని నాసిరకం పాలను విక్రయిస్తున్నాయట. అలాగే కొన్ని కంపెనీలు పాలలో పోషక పదార్థాలు లేకున్నా ప్యాక్‌లపై పోషక పదార్థాలు ఉన్నాయని ప్రింట్ చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తూ పాలను అమ్ముకుంటున్నాయట.
ఢిల్లీలో ఆయా కంపెనీలు అమ్ముతున్న పాలు, పాల సంబంధ పదార్థాలు 161 రకాల నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయట. అంటే ఆ పాలు, పాల సంబంధ పదార్థాలను జనాలు తీసుకోరాదని స్పష్టమవుతుంది. ఇక ఢిల్లీలో అమ్ముతున్న 2880 పాలు, పాల సంబంధ పదార్థాల్లో 477 పదార్థాలు నాణ్యత లోపించాయని, అవి ఏమాత్రం నాణ్యంగా లేవని తేలింది. దీంతో ఢిల్లీ వాసులు ఆయా ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.
సాధారణంగా విక్రయదారులు అమ్మే ఆహార పదార్థాలు ఏవైనా సరే.. వాటిలో నాణ్యత లోపిస్తే.. వాటిని కొనుగోలు చేసిన వినియోగదారులు తమకు నష్టం కలిగిందని ఫిర్యాదు చేస్తే.. ఆ సందర్భంలో నాణ్యత లోపించిన ఆహారాలను, హానికర ఆహారాలను అమ్మిన విక్రయదారులపై కేసు నమోదు అవుతుంది. ఈ పక్షంలో కేసు రుజువైతే విక్రయదారులకు కోర్టు కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొందరు విక్రయదారులు ఇవేవీ పట్టించుకోకుండా.. తమను ఏం చేస్తారులే.. అన్న ధోరణిలో యథేచ్ఛగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. నాణ్యంగా లేని, హానికరమైన రసాయనాలు ఉన్న ఆహారాలను అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇకనైనా ప్రజలు మేల్కొనకపోతే.. మనం ఇలాంటి వారి చేతిలో మోసపోక తప్పదు..!