డ్రైవింగ్ లైసెన్స్ కావాలా..? అయితే టెస్ట్ లేకుండా ఏడు రోజుల్లో పొందండిలా..!

-

వాహనాన్ని నడిపేందుకు లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. లైసెన్స్ లేకుండా నడపడం తప్పు. అయితే మీరు కూడా లైసెన్స్ ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం ఇలా అప్లయ్ చెయ్యచ్చు. లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం లో మీరు ఎదురు చూడక్కర్లేదు. డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు.

ఏడు రోజుల్లోనే మీరు దీన్ని పొందొచ్చు. కేవలం ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ప్రతి నెలా వేలాది మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తూ వుంటారు. ఒకవేళ కనుక టెస్ట్ లో ఫెయిల్ అయితే లైసెన్స్ రాదు. అయితే మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉంటే ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. అయితే వీళ్ళకి కేవలం లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే లభిస్తుంది. అలానే ఆ వ్యక్తి గేర్ లేని వాటిని మాత్రమే నడపగలడు. పైగా ఎక్కడకి వెళ్ళక్కర్లేదు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

దీని కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
ఇక్కడ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి.
ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి.
మీరు మీ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసేస్తే RTO వాటిని ధృవీకరిస్తుంది.
ఆ తరవాత మీరు ఏడు రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ని పొందొచ్చు.
ఇది కేవలం లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే. టెస్ట్ లేదు అంటే అది లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news