తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య శనివారం హైదరాబాద్‌లో సందడి చేశారు. ఆయన కొత్త మూవీ రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గెస్టుగా రౌడీ బాయ్ విజయ దేవరకొండ వచ్చి ఫ్యాన్స్‌ను ఉత్తేజ పరిచారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సూర్య.. తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనాన్ని కొనియాడారు. ‘చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు స్ఫూర్తితోనే మేము ‘అగరం’ ఫౌండేషన్ ప్రారంభించి సాయం చేస్తున్నాం. ఆరేడేళ్ల కిందట అగరం ఫౌండేషన్ విరాళాల సేకరణకు అమెరికా వెళ్తే దాదాపు 30 శాతానికి పైగా ఫండ్ తెలుగు కమ్యూనిటీకి చెందిన విద్యార్థుల నుంచే వచ్చింది’ అని చెప్పారు. ఇదంతా మీ వళ్లే సాధ్యమైందని సూర్య చెప్పుకొచ్చారు.