‘నాపై ఉన్న పోక్సో కేసును కొట్టేయండి’ : యడ్యూరప్ప

-

పోక్సో కేసుకు సంబంధించిన ప్రత్యేక కోర్టుడో ఆయనపై పోలీసులు గురువారం ఛార్జిషీట్ దాఖలు చేశారు. 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు.

ఇక ఆ సమయంలో తన కుమార్తెను ఆయన బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో సదాశివనగర్ పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరోపణలను మాజీ సీఎం యడ్యూరప్ప  ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news