కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ చెప్పింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు బూస్టర్ డోసు కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణ అంశాన్ని డి సి జి ఐ కి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. ఇందుకోసం మంగళవారం సమావేశమై చర్చించి నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే రెండు డోసులు కోవాక్సిన్, మూవీస్ వుడ్ టీకా తీసుకున్నవారికి బూస్టర్ డోసు కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే భారత్ లో ఈ చుక్కల మందు టీకా ఈ సంవత్సరం మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే ఎసిఈ సమావేశమై.. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ టీకా అత్యవసర వినియోగ అనుమతులపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా అటు ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.