టాలీవుడ్ నుంచి బుట్ట బొమ్మకు చుక్కెదురు.. కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో అందంతో ప్రేక్షకులను మైమరిపింప చేసిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారి ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన నటనతో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక పూజా హెగ్డే అలవైకుంటపురంలో అనే సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ దువ్వాడ జగన్నాథం సినిమాతో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అయింది.

ఇకపోతే ఈమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. సినిమా ఆఫర్లు మాత్రం ఈమెకు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మంచి ఫామ్ లో దూసుకుపోతుంది పూజా హెగ్డే. ఇకపోతే ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అని అప్పటి వరకు అందరూ అనుకున్నారు. కానీ ఈ మూడు సినిమాలతో ఒక్కసారిగా ఈమె ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే ఈమె మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకవైపు బాలీవుడ్ లో ఈమెకు వరుస అవకాశాలు వస్తూ ఉండడం మనకు తెలిసిందే. కానీ ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఒక నెగిటివిటీని మూటకట్టుకుంది.

అదేమిటంటే భారీ పారితోషకం తో పాటు వ్యక్తిగత ఖర్చులతో కూడా నిర్మాతలకు చుక్కలు చూపించింది. ఈ విషయం ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారినా.. చివరికి ఆ నిర్మాతలు తన వ్యక్తిగత బిల్లులను తననే కట్టుకోమని వెనక్కి పంపించేశారు. అయితే ఇదంతా బీస్ట్ సినిమా విషయానికి సంబంధించింది అని అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ టాలీవుడ్ లో బిజీగా మారింది. డిమాండ్ చేయడంతో పాటు డిమాండ్ తగ్గించే బాధ్యత టాలీవుడ్ పైన ఉంది అని సమాచారం. ఇక టాలీవుడ్ నిర్మాతలు కూడా తనను వెనుక లాగడానికి ఇదే సరైన సమయం అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగానే పారితోషకం విషయంలో కాకుండా వ్యక్తిగత ఖర్చులతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమెతో ఒక అగ్రిమెంట్ రాసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మడి డిమాండ్ కి టాలీవుడ్ గట్టిగా షాక్ ఇచ్చేలా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version