ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం..ప్రముఖ హీరోయిన్ సోదరుడి అరెస్ట్

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా బాలీవుడ్ లోనూ డ్రగ్స్ కేసు కలకలం రేపుతుండగా, తాజాగా మరో సెలబ్రిటీ ఈ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బ్రదర్, సీనియర్ యాక్టర్ శక్తికపూర్ తనయుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు.

తాజాగా ఎంజీ రోడ్ లోని ఓ హోటల్ లో పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో బాలీవుడ్ సెలబ్రిటీ సిద్ధాంత్ ఉన్నాడు. వీరి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపారు.

టెస్టు రిజల్ట్స్ ఆరుగురికి పాజిటివ్ గా వచ్చాయి. సిద్ధాంత్ కపూర్..పలు బాలీవుడ్ ఫిల్మ్స్ కు కో డైరెక్టర్ గా పని చేసిన సిద్ధాంత్.. పలు సినిమాల్లో నటుడిగానూ పని చేశాడు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news