మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో ట్విస్ట్..హైదరాబాద్ తో లింకులు..!

-

మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. తమిళనాడు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఎన్సీబీ బృందం దాడి దాడి చేసింది. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను ఆస్ట్రేలియా ఎగుమతి చేసేందుకు డ్రగ్స్ ముఠా ప్ర‌య‌త్నించ‌గా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. ఎఫిడ్రిన్ తయారీ హైదరాబాద్ కేంద్రంగా నడిచినట్లు విచారణలో వెల్లడయ్యింది. ముంబై లోని అంతేరి లో ఐదు కోట్ల విలువైన ఎఫిడ్రిన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాదకద్రవ్యాల తయారీ అంతా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. మాదక ద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్ కు దిగుమతి చేసుకుని ఎఫిడ్రిన్ గా మార్చి అక్రమంగా దందా చేస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. విదేశాలకు హైదరాబాద్ నుండి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. 50,000 విలువచేసే ఎఫిడ్రిన్ ఆస్ట్రేలియాలో 5 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం. మొత్తం 10 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ విచార‌ణ కొన‌సాగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news