SamChay Divorce: గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నాగచైతన్య-సమంతల జంట నిజం చేసింది. ఏడేళ్లు ప్రేమించుకున్నసామ్ చైతూలు పెద్దలను ఒప్పించి, 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. అనూష్యంగా ఉన్న ఈ జంటను చూసి టాలీవుడ్ లో కుల్లుకున్న ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఆ జంట మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చారు.
నాలుగేళ్లు గడవక ముందే ఆ జంట.. తమ వివాహబంధానికి పుల్ స్టాఫ్ పెట్టేసింది. శనివారం నాడు సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య- సమంతలు.. తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు. తామిద్దరం విడాకులు తీసుకోనున్నమని, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని అనుకున్నామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తుంది. పెళ్లికి ముందే వారి మధ్య ఒప్పందం జరిగిందని ఓ వైరల్ అవుతుంది. భవిష్యత్‌లో ఒకవేళ విడిపోవాల్సి వస్తే.. నాగ చైతన్య నుంచి సమంత భరణం ఆశించనని చెప్పిందట. అలాగే, సామ్ నుంచి చైతూ ఆర్థికపరమైన సహకారాన్ని కూడా తీసుకోనని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విడాకులు తీసుకున్నారని సమాచారం.