అమ్మా బండి పోయింది… డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రామా…!

-

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణ పోలీసులు ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారనేది అందరికీ చెప్పాల్సిన పనిలేదు. గత ఐదారేళ్లుగా మద్యం వల్ల నేరాలు-ఘోరాలు పెరిగిపోయాయనే భావనలో ఉన్న తెలంగాణ పోలీసులు దానిని అదుపు చేసేందుకు గాను డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీనితో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

అంతవరకు బాగానే ఉన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనాలను పోలీసులు తన వద్దే ఉంచుకు౦టున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కౌన్సెలింగ్ కి వస్తే వాహనాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు హైదరాబాదులో ఉండే విద్యార్థులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఉద్యోగులు కాస్త సరికొత్తగా ఆలోచించటం మొదలు పెట్టారు. తమ కుటుంబ సభ్యులను తీసుకురాలేరు, ఇలా దొరికాం అని తెలిస్తే తెలిస్తే వాళ్ళు హైదరాబాదు నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అనే భయంలో భాగంగా వాహనాలను పోలీసులు వద్దే వదిలేస్తున్నారు. పోతే పోయింది అనుకుంటున్నారట.

ఇంట్లో వాహనం పోయిందని పోలీస్ స్టేషన్లో తాను కంప్లైంట్ కూడా ఇచ్చా అని అయినా బండి దొరకటం లేదని కుటుంబ సభ్యులకు అబద్ధాలు చెబుతున్నారని, పోలీసులకు ఫైన్ కట్టి గాని, కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ వెళ్లి గాని వాహనాలు తీసుకోవడం లేదట.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైన వాటిలో ఎక్కువభాగం ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు కూడా అంటున్నారు. దాదాపు 15 నుంచి 25 శాతం వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. చాలా మంది వాహనదారులపై వదులుకోవడానికి ఇష్టపడుతున్నారట. పోలీస్ స్టేషన్ కి వెళ్లడం లేదట దీనితో ఈ విషయంలో పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news