ఇటీవల కాలంలో ఏది కావాలన్నా ఆన్ లైన్‌లో చూసుకోవడం.. ఆర్డర్ పెట్టేసుకోవడం. ఆన్ లైన్ షాపింగ్ లు కూడా పెరిగిపోతున్నాయి. ఇక మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం. ఇప్పుడు మెట్రో నగరాల్లోని యువత ఎక్కువగా ఈ విధంగానే తమకు కావలసిన ఫుడ్ ని క్షణాల్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దీంతో ఫుడ్‌డెలివరీ సంస్థలకు రోజురోజుకూ ఆర్డర్లు సంఖ్య పెరిగిపోతున్నాయి. వీటిలో ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండా వంటి సంస్థల్లో మాత్రమే ఫుడ్‌లవర్స్‌ఆర్డర్లను పెట్టుకుంటారు. ఆ సంస్థలు కూడా వారి కస్టమర్లకు నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లో అందిస్తున్నాయి. అయితే దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో ఈ విధంగా ఆన్‌లైన్‌ఫుడ్‌ఆర్డర్లను చేసకునే జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో ఉందని ఒక సర్వేలో తెలిపారు.
బెంగళూరులో దాదాపుగా రోజుకు 95 వేల ఆన్‌లైన్‌ఆర్డర్లు వస్తాయని సంస్థ పేర్కొంది. కాగా తరువాత వచ్చే మూడు స్థానాల్లో ఢిల్లీ, ముంబై ఉండగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా టాప్ 5లొ స్ధానం దక్కించుకుందని ట్రాక్సాన్‌అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారించారు. ఇకపోతే ఢిల్లీలో ఒక రోజుకు 87 వేలు ఆర్డర్లు వస్తాయని, ముంబైలో 62 వేల ఆర్డర్లు అందుతున్నాయని తెలిపారు. అలాగే నాలుగో స్థానం దక్కించుకున్న హైదరాబాద్‌లో ప్రతిరోజు 54 వేల ఆర్డర్లు ఫుడ్‌డెలివరీ సంస్థలకు అందుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ దాదాపుగా వెయ్యి ఫుడ్‌డెలివరీ సంస్థ ఏర్పాటు కాగా అందులో ఎక్కువగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం.