తెలంగాణ మందుబాబులకి అలెర్ట్..

-

తెలంగాణలో ఈ రోజు నుంచి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా చాలా నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేసింది. అయితే దీనిని ఆసరాగా చేసుకుని మందు బాబులు తాగి తామే డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.

ప్రతి వీక్ ఎండ్ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అదీ కాక ఈ వారంలో న్యూ ఇయర్ వేడుకలు కూడా భారీ ఎత్తున జరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ పరీక్షలు ప్రారంభించాలని సర్కార్ యోచించింది. అందుకే ఈ రోజు నుంచి హైదరాబాద్ సహా దాదాపు అన్ని నగరాలు అలాగే పట్టణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

Read more RELATED
Recommended to you

Latest news