ఎప్పుడూ కోపం వస్తుందా..? అయితే మీకు అది ఉన్నట్లే..

-

ఎన్ని ఆస్తులు, అంతస్థులు ఉన్నా.. కంటికి సరైన నిద్ర లేకుంటే జీవతమే వృథా అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మానవ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన సమయానికి నిద్ర పోవాల్సిందే. కానీ.. ప్రస్తుతం నిద్ర లేక అనేక రోగాలకు దారి తీస్తోంది. దాదాçపుగా 8–9 గంటల నిద్ర అవసరమని అందుకు అనుగుణంగా సమయాన్ని కేటాయించుకోవాలని వైద్యులు అంటున్నారు. కంటి నిండ నిద్ర పోతేనే మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తాయి. తద్వారా గుండె, మెదడులలో రోగనిరోధక శక్తి పెరిగి, ఉదయం లేచినప్పుటి నుంచి ఉత్సాహంగా ఉంటామని వైద్యశాస్త్రం చెబుతోంది.

అలసట, నిరుత్సాహం..

రాత్రంతా సరైన నిద్రలేకపోతే లేచినప్పుటి నుంచి అలసట, ఏదో కోల్పోయిన భావన మనలో మెదిలి అంతగా ఉత్సాహం కనబడదు.డ్యూటీలో ఒత్తిడి, ఇంట్లో పని, తదితర కారణాలతో కంటికి సరైన నిద్రలేకపోతే నిరుత్సాహం, విపరీతమైన కోపం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం, వపరీతమైన కోపం లాంటి సంఘటనలు తలెత్తుతాయి. 8–9 గంటల నిద్ర దొరక్కపోతే మెదడులో కీలకభాగమైన ‘అమిగ్‌డాలా’ రసాయన పనితనం బాగా మందగిస్తుందని జర్నల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇటీవల తేల్చి చెప్పింది. నిద్రలేకపోతే కోపానికి దారి తీస్తుందని.. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా వెల్లడించింది. ఆ సమస్యకు చెక్‌ పెట్టాలంటే క్రమం తప్పకుండా వ్యయామం, అందుకు తగ్గ పౌష్టికాçహారం, మానసిక ప్రశాంతత ఉండాల్సిందే నని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఉద్యోగాల్లో ఒత్తిడి, తదితర కారణాల మూలంగా నిద్రకు సమయం కేటాయించక ఉరుకులు, పరుగులతో పోటీ పడితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి పనులున్నా.. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత సమస్యలు, ఒత్తిడిని పక్కన పెట్టి కంటినిండా నిద్ర పోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news