బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్ 2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) అనారోగ్యంతో నేడు కన్నుమూశారు.
కొద్దిరోజులగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఫిలిప్ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కు చేరుకున్న తర్వాత ఆయన మళ్లీ అనారోగ్యాన్ని గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. శుక్రవారం ఉదయం ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరిలో ప్రత్యేక చికిత్స తీసుకున్నారు.
ఇదిలా ఉండగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్2 ను 1947లో ప్రిన్స్ ఫిలిప్ పెళ్లి చేసుకున్నారు. ఆమె బ్రిటన్ రాణి కావడానికి ఐదేళ్ల ముందే వారి వివాహాం జరిగింది. ఎలిజబెత్, ఫిలిప్ దంపతులకు నలుగురు పిల్లలు, 8 మంది మనవళ్లు, పది మంది మునిమనవళ్లు ఉన్నారు. ఫిలిప్ గ్రీకు ఐలాండ్‌లోని కార్ఫులో 2021 జూన్ 10న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కూడా రాజకుటుంబానికి చెందిన వారే. రానున్న జూన్ నెలలోనే ఫిలిప్ వందేళ్లు పూర్తి చేసుకోవాల్సి ఉండగా ఆయన ఈలోపే కన్నుమూశారు. ఫిలిప్ మృతిపట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతాపం ప్రకటించారు. ఆయన సేవాస్ఫూర్తిని గుర్తుచేసుకుని కొనియాడారు. ఎటువంటి వివాదాలు లేకుండా దేశం కోసం పనిచేయడంలో ఫిలిప్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
చిన్నప్పుడే గ్రీస్ నుంచి బహిష్కరణ పొందిన ఫిలిప్ ఆ తరువాత జీవితకాల సేవను, అంకితభావంతో గుర్తుంచుకుంటారు. 5,400 కి పైగా ప్రసంగాలు ఇచ్చాడు. అదేవిధంగా తెరవెనుక అసంఖ్యాక బాధ్యతలకు పాల్పడ్డాడు.దాదాపు 780 చారిటీలను నిర్వహించాడు. 2017 నుంచే రాచరికానికి చెందిన అన్ని బాధ్యతను నుంచి రిటైర్ అయ్యారు. 1997 ప్రిన్స్ ఫిలిప్ దంపతులు 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ‘నా భర్తే నాకు కొండంత అండ’ అని ప్రసంగంలో ఎలిజెబెత్ తెలిపింది. డ్యూక్ బ్రిటిష్ రాచరిక అభివృద్ధికి తీవ్ర ప్రభావాన్ని చూపింది. డ్యూక్ వయస్సులో ఉన్నప్పుడు ఓ అద్భుతమైన పోలో ఆటగాడు. క్రికెట్ కూడా ఆడేవాడు.
వివిధ దేశాల అధినేతలు, ప్రజలు ఫిలిప్ మృతికి తమ సంతాపాన్ని ప్రకటించాయి. ఫిలిప్ తల్లి కూడా క్వీన్ విక్టోరియా ముని మనవరాలు క్వీన్ అలైస్, తండ్రి ప్రిన్స్ ఆండ్రూ. డ్యూక్ 18 నెలల వయస్సులోనే వారి రాజ్యం కోల్పోయి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆయన ఫ్రాన్స్, జర్మనీ, యూకేలలో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు విడిపోయారు. 1939లో అతనికి 18 ఏళ్ల వయస్సులో నేవీలో చేరాడు. ఆ సమయంలోనే క్వీన్ ఎలిజెబెత్‌ను ఫిలిప్ కలిసినపుడు ఆమె వయస్సు 13 సంవత్సరాలు.