విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా చివరి రూపం శ్రీరాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కాగా ఇవాళతో వేడుకలు ముగియనున్నాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అధికారులు ఉత్సవాలకు లాంఛనంగా ముగింపు పలికారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, సీపీ ద్వారకాతిరుమలరావు, పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, సభ్యులు తదితరులు హాజరయ్యారు. దుర్గామల్లేశ్వరులు కృష్ణా నదిలో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా వచ్చారు. నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ పండితులు పేర్కొన్నారు.