ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వచ్చిన సినిమా హలో గురు ప్రేమ కోసమే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమా నిర్మించారు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
సంజయ్ అలియాస్ సంజు (రామ్) కాకినాడలో బిటెక్ కంప్లీట్ చేసి స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడుపుతుండగా.. తల్లి కోరిక మేరకు హైదరబాద్ వెళ్లి ఆమె స్నేహితుడు విశ్వనాథ్ (ప్రకాశ్ రాజ్) దగ్గర ఉంటూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు సంజు. అయితే మొదటి చూపులోనే అను (అనుపమ పరమేశ్వన్)ను ప్రేమిస్తాడు సంజు. అయితే విశ్వనాథ్ తన కూతురికి వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఇలాంటి టైంలో సంజు ఎలా తన ప్రేమని గెలిపించుకున్నాడు..? విశ్వనాథ్ సంజుల మధ్య అను ఎంత నలిగిపోయింది అన్నదే సినిమా.
ఎలా ఉందంటే :
ప్రేమ కథలు అనగానే ఒకే కథను అటు ఇటు తిప్పి చెబుతుంటారు అందుకే ప్రతి ప్రేమకథ సినిమాల్లో కాస్తో కూస్తో పోలికలు ఉండటం సహజం. అయితే హలో గురు ప్రేమ కోసమే సినిమా కూడా ఇదవరకు వచ్చిన చాలా సినిమాల రిఫరెన్స్ గమనించవచ్చు. ముఖ్యంగా వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మరొక వర్షన్ రాస్తే అదే హలో గురు ప్రేమ కోసమే సినిమా అనొచ్చేమో.
అక్కడ ఇద్దరు స్నేహితుల మధ్య సత్సంబంధాలు చెడిపోకూడదని వెంకటేష్ తన ప్రేమని త్యాగం చేస్తాడు. హలో గురు ప్రేమ కోసమే సినిమాలో కూడా అంతే స్నేహం చెడిపోకూడదని అను ప్రేమని త్యాతం చేయాలనుకుంటుంది. ఇక సినిమా మొదటి భాగం అంతా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా సాగించాడు. సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ సీన్స్ రాసుకున్నాడు.
కాస్టింగ్ విషయంలో దర్శకుడు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కథ, కథనాలు కొత్తగా అనిపించవు.. అయితే ఎంటర్టైనింగ్ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా హలో గురు ప్రేమ కోసమే సినిమా పర్వాలేదనిపించింది.
ఎలా చేశారు :
సంజయ్ పాత్రలో రామ్ నటన బాగుంది. తన మార్క్ ఎమోషన్స్ తో హీరో పాత్రకు న్యాయం చేశాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో కాస్త హాట్ గా కనిపించేందుకు ప్రయత్నించింది. రాం, అనుపమ పెయిర్ బాగుంది. ఇక ప్రణీత చిన్న పాత్రలో అలరించింది. సినిమా మొత్తం హీరోతో పాటుగా ప్రకాశ్ రాజ్ పాత్ర అలరిస్తుంది. వారి మధ్య రాసుకున్న సీన్స్ బాగా వచ్చాయి.
విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. సినిమాకు కావాల్సిన మూడ్, లుక్ తన కెమెరాతో వచ్చేలా చేశాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. ఎందుకో దేవి తన మార్క్ చూపించలేకపోయాడు. కథ, కథనాల్లో దర్శకుడు తన ప్రతిభ చాటాడు. అయితే కథ ఎలా ఉన్నా కథనం మెప్పించింది. డైలాగ్స్ రాసిన ప్రసన్న కుమార్ ఆకట్టుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కాస్టింగ్
కామెడీ
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
స్టోరీ
స్క్రీన్ ప్లే
బాటం లైన్ :
హలో గురు ప్రేమ కోసమే.. రొటీన్ ఎంటర్టైనర్..!
రేటింగ్ : 2.5/5