ఏపీ విద్యార్థులకు శుభవార్త.. 9 రోజులు సెలవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. అకాడమిక్ ఇయర్ ప్రారంభ సమయంలోనే దసరా సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు రోజులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే 9 వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. ఇక ఆ 17వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలు 18వ తేదీన పున ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే తొమ్మిది రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి.

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించిoది. తిరిగి ఈనెల 18 వ తారీఖున పాఠశాలలు తెలుసుకొనున్నాయి. అలాగే ఈనెల 13వ తారీకు నుంచి 16వ తారీకు వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు ఉండనున్నాయి.