దుమ్ములేపుతున్న రౌడీ బేబీ.. సంచ‌ల‌న రికార్డు..!

-

మూవీ హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా కొన్ని సినిమాల్లోని పాటలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమాపై ఆడియన్స్ లో విడుదలకు ముందే మంచి అంచనాలను పెంచుతాయి. అలాంటి పాటల్లో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అందాల ముద్దు గుమ్మ సాయి పల్లవి కలిసి చేసిన మారి సినిమాలోని రౌడీ బేబీ పాట. తెలుగులో రౌడీ బేబీ పేర విడుదలయిన ఈ మూవీ డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఈ సినిమాలోని రౌడీ బేబీ పాట మాత్రం యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదలయి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచాయి. అయినా కూడా ఈ మూవీలోని పాట హవా తగ్గడం లేదు. ఇప్పటి వరకు ఈ పాటను యూట్యూబ్ లో 1.1 బిలియన్ల మంది వీక్షించారు.

అంతే కాకుండా యూట్యూబ్ లో 5 మిలియన్లకు పైగా లైకులు పొందిన తొలి దక్షిణాది పాటగా నిలిచింది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ పాటకు అందిచిన బాణీలు అదిరిపోయాయి. ఇక ఈ పాటకు ప్రభుదేవా, జానీ మాస్టర్ స్టెప్పులేయించారు. అంతే కాకుండా ఈ పాటలోని స్టెప్పులు కూడా ఈ పాట ఇంతలా ఆకట్టుకోవడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తో కలిసి స్టార్ హీరో ధనుష్ చేసిన హంగామా పాటకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. కేవలం ఆడియో మాత్రమే కాకుండా వీడియో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక రెండో స్థానంలో తెలుగు మూవీ అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ అనే పాట నిలించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి అందాల అమ్మడు పూజా హెగ్డే ఈ పాటకు చిందులేసింది. ఈ పాట విన్న తర్వాత మూవీ హీరోయిన్ కు బుట్ట బొమ్మ అనే పేరు స్థిరపడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ పాట ఎంతలా హిట్ అయిందో.

Read more RELATED
Recommended to you

Latest news