ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇంకా బ్రేక్ ఈవెన్ కి ఎంత రావాలంటే..?

-

రవితేజ హీరోగా ఈగల్ కార్తీక్ ఘటంనేని దర్శకత్వంలో రిలీజ్ అవ్వనుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై ఈ సినిమాని తరిమెదికి తీసుకువచ్చారు 2024 లో రిలీజ్ అవుతున్న భారీ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు కానీ సినిమాని వాయిదా వేశారు ఫిబ్రవరి 9న ఈ సినిమాని గ్రాండ్గా విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి పాజిటివ్ బజ్ వస్తోంది. రవితేజ ఫ్యాన్స్ ఈసారి కచ్చితంగా ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.

టీజర్, ట్రైలర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. రవితేజ ఈగల్ సినిమాని చూసి ఫుల్ సాటిస్ఫై అయినట్లు కూడా చెప్పారు దీంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా పెట్టుకున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో లెక్కల ప్రకారం నైజంలో ఆరు కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లు ఆంధ్రలో 8.5 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేసింది కర్ణాటక సహా రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లు ఓవర్సీస్ లో రెండు కోట్లు మొత్తంగా ఈ సినిమా 21 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగిందట. ఈ లెక్కన సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో రంగంలోకి దిగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news