టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ని ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ కి ఎంపిక చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 3 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. దీనితో ఈ టోర్నీ లో యువరాజ్ పాల్గొన వచ్చు అని అతని మేనేజర్ ఒకరు మీడియాకు చెప్పారు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువీ.. అబుదాబి వేదికగా జరిగిన గ్లోబల్ టీ20 కెనడా టీ10 లీగ్‌లో పాల్గొన్నాడు.
డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే బిగ్ బాష్ లీగ్ లో యువరాజ్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో పాల్గొవడానికి యువీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి ఎన్‌ఓసీ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. బిబిఎల్ ఫ్రాంచైజీలు జట్టులో అంతర్జాతీయ క్రికెటర్లను చేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయని ఇటీవల ప్రచారం కూడా జరిగింది.