ప‌బ్‌జి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. గేమ్ మ‌ళ్లీ అందుబాటులోకి..?

-

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌బ్‌జి ప్రియుల‌కు ప‌బ్‌జి కార్పొరేష‌న్ ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. ప‌బ్‌జి మొబైల్‌, ప‌బ్‌జి మొబైల్ లైట్ గేమ్‌ల‌కు ప‌బ్లిషింగ్ హ‌క్కుల‌ను తామే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తామ‌ని, ఇక‌పై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో త‌మ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టి వ‌రకు ఈ రెండు గేమ్స్‌కు టెన్సెంట్ కంపెనీ ప‌బ్లిషర్‌గా ఉంది. అయితే ఈ గేమ్‌ను భార‌త్‌లో బ్యాన్ చేసిన నేప‌థ్యంలో ఇక‌పై టెన్సెంట్‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధాలు ఉండ‌వ‌ని ప‌బ్‌జి కార్పొరేష‌న్ తెలిపింది. దీంతో గేమ్ భార‌త్‌లో మ‌ళ్లీ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తాము ఆశిస్తున్నామ‌ని తెలియ‌జేసింది.

pubg corporation cuts their relationship with tencent to bring back pubg in india

అయితే ప‌బ్‌జి కార్పొరేష‌న్ కేవ‌లం భార‌త్‌లో మాత్ర‌మే టెన్సెంట్ గేమ్స్‌తో ఉన్న సంబంధాన్ని క‌ట్ చేసుకుంది. ఇత‌ర దేశాల్లో టెన్సెంట్ గేమ్స్‌తో వ్యాపార సంబంధాలు అలాగే ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం ప‌బ్‌జి మొబైల్, ప‌బ్‌జి మొబైల్ లైట్ గేమ్‌ల‌కు స్వ‌యంగా ప‌బ్‌జి కార్పొరేష‌నే ప‌బ్లిష‌ర్‌గా ఉంటుంది. దీంతో టెన్సెంట్‌కు ఇక సంబంధం ఉండ‌దు. అందువ‌ల్ల పూర్తిగా చైనాయేత‌ర కంపెనీ చేతుల్లోనే ఈ గేమ్ ఉన్న‌ట్లు అవుతుంది. ఈ క్ర‌మంలో గేమ్‌పై ఉన్న నిషేధాన్ని భార‌త ప్ర‌భుత్వం ఎత్తి వేస్తుంద‌ని ప‌బ్‌జి కార్పొరేష‌న్ భావిస్తోంది.

అయితే ఈ విష‌యంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ప‌బ్‌జి కార్పొరేష‌న్ ద‌క్షిణ కొరియాకు చెందిన‌ది క‌నుక.. ఈ గేమ్‌తో టెన్సెంట్‌కు ఉన్న‌ సంబంధాల‌ను క‌ట్ చేసుకుంటే.. వ‌చ్చే అభ్యంత‌రాలు ఏమీ ఉండ‌వు. చైనాతో ఈ గేమ్‌కు ఎలాంటి లింక్‌లు ఉండ‌వు. క‌నుక కేంద్రం గేమ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తుంద‌నే అనుకుంటున్నారు. అయితే దీనిపై కేంద్రం త్వ‌ర‌లో ఆశించిన విధంగానే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. నిజంగా ఇది ప‌బ్‌జి ప్రియుల‌కు గుడ్ న్యూసేన‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news