కొంతమంది పిల్లలకు చిన్న వయస్సులోనే చెవులను కుట్టిస్తూ ఉంటారు. అయితే, చాలా చిన్న వయసులో చెవులు కుట్టించడం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. చెవులు కుట్టించే ముందు డాక్టర్ సలహాలను తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో చెవులను కుట్టించడం ఒక భాగం. పిల్లలకి చెవులను కుట్టించి, కమ్మలను పెడుతూ ఉంటారు. అయితే, ఇదంతా చిన్న వయసులోనే చేస్తారు. దాని వలన పిల్లలు ఎంతో నొప్పిని ఎదుర్కొంటారు. పైగా కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఆరు నెలలు అనేది చెవులను కుట్టించడానికి సరైన వయసు అని డాక్టర్ లు చెబుతున్నారు. లేకపోతే, మూడున్నర సంవత్సరాలు వచ్చాక కుట్టించవచ్చు. కొంతమంది పిల్లలకు మూడు డోసుల వ్యాక్సిన్ వేయించిన తర్వాత చెవులు కుట్టించవచ్చు అని భావిస్తారు. అయితే, చెవులను కుట్టించేటప్పుడు ట్రైనింగ్ తీసుకున్న ఎక్స్పర్ట్ తో కుట్టించాలి. స్థానిక వ్యాపారులు లేక సంప్రదాయ పద్ధతులు పాటించే వారితో చెవులను పుట్టించడం వలన ఇన్ఫెక్షన్లు లేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా చెవులు ఎర్రగా మారడం, వాపును ఎదుర్కొవడం, నొప్పితో బాధపడడం వంటివి ఎన్నో ఇబ్బందులను పిల్లలు ఎదుర్కొంటారు.
కనుక తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అంతేకాకుండా, కుట్టించిన తర్వాత కుట్లు వేయడం వలన టెటనస్ వచ్చే ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎంతో ప్రమాదకరం, కనుక సరైన జాగ్రత్తలను తీసుకుని మాత్రమే చెవులను కొట్టించాలి. చెవులను కుట్టించేముందు నంబింగ్ క్రీమ్ వంటివి ఉపయోగించడం, చెవిని ఐస్ తో మసాజ్ చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా, చిన్న వయస్సులో పిల్లలకి చెవులు కుట్టించకపోవడమే మేలు. వారికి అవగాహన ఉండకపోవడం వలన చెవుని లాగడం, ముట్టుకోవడం వంటివి చేస్తారు. దీంతో నొప్పి వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.