ముందస్తు మూడు..ఇంకా జనంలోనే కేసీఆర్..!

-

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో అర్ధం అవ్వని పరిస్తితి..కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. కానీ గత అనుభవం బట్టి చూస్తే..పైకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు గాని కేసీఆర్ ఏ క్షణంలో అయినా..ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలే కాదు..చిన్నాచితక పార్టీలు సైతం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని చెబుతున్నారు.

దీంతో అన్నీ పార్టీలు ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ సైతం ఆల్రెడీ ఎన్నికల మూడులోకి వెళ్ళినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే సిట్టింగులు అందరికీ సీట్లు అని కేసీఆర్ ప్రకటించేశారు. అటు ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు పథకాల ద్వారా తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్..ఎక్కడకక్కడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు.

ఇక కేసీఆర్ రాజకీయంగా బీజేపీపై యుద్ధం చేస్తూనే..రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇకనుంచి జనంలోనే ఉండేలా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే డిసెంబర్ నుంచి భారీ సభల ద్వారా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 4న మహబూబ్‌నగర్‌లో, డిసెంబర్ 7న జగిత్యాలలో భారీ సభలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు తర్వాత మహబూబాబాద్, కరీంనగర్‌లలో సభలు నిర్వహించనున్నారు. అక్కడ నుంచి వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.

అయితే ముందస్తు ఎన్నికల ప్రణాళికల్లో భాగంగానే కేసీఆర్..ఇలా జనంలోకి వెళుతున్నారని..వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలైతే వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరగుతాయి. మరి అప్పటివరకు ఉంటారా? మధ్యలో వ్యూహం మార్చి ముందస్తుకు వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version