కరోనాతో వేల కోట్లు సంపాదించాడు…!

-

కరోనా వైరస్ దెబ్బకు చాలా మందికి ఆర్ధికంగా నష్టపోయారు. ఆర్ధిక నష్టాలతో వ్యాపారాలు కూడా మూసేసుకునే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే ఒక వ్యాపారి మాత్రం బాగా లభాపడ్డాడు. వైద్య పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీనితో సింగపూర్ కు చెందిన షెంజెన్ మైండ్‌రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ లి జిటింగ్ ఈ దెబ్బకు శ్రీమంతుడు అయిపోయారు.

ఆయన కంపెనీ వెంటిలేటర్లు సహా వైద్య పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అన్ని దేశాలు కూడా భారీగా వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఆయన ఇప్పుడు సింగపూర్‌లో అత్యంత సంపన్నుడిగా మారిపోయారు. కరోనా కారణంగా షెంజెన్ మైండ్‌రే స్టాక్ ధర 50 శాతం వరకు నికర సంపద విలువ ఒక్కసారిగా రూ.32,777 కోట్లు నుంచి రూ.1,02,905 కోట్లకు చేరుకుంది.

ప్రతి 24 గంటలకు ఆయన రూ.287 కోట్లు ఆర్జించారు. గంటకు రూ.12 కోట్ల వరకు ఆయన సంపాదించడం గమనార్హం. షెంజెన్ మైండ్‌రే కంపెనీకి 100కు పైగా దేశాల నుంచి ఆర్డర్లు రావడంతో ఆయన ఫుల్ బిజీ అయిపోయారు. ఇటలీ నుంచి 10 వేల వెంటిలేటర్ల ఆర్డర్లు వచ్చాయి ఆయనకు. సింగపూర్ తో సన్నిహితంగా ఉండే అమెరికా భారీగా దిగుమతి చేసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news