చాలామంది ఉద్యోగాలని చేయడం కంటే వ్యాపారాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే వ్యాపారం చేయాలంటే కొంత పెట్టుబడి ఉండాలి. మీ దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవా..? అయినా సరే పర్వాలేదు. జీరో ఇన్వెస్ట్మెంట్ తో డబ్బులు సంపాదించచ్చు. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికోసం చూసేద్దాం.
ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటున్నారు. అది ఒక్కటే చాలు డబ్బు సంపాదించడానికి. మీరు ఉద్యోగం చేయడమే కాకుండా ఏకంగా మీరు పది మందికి ఉద్యోగాన్ని ఇచ్చేలా మీ టైం మారిపోతుంది. ఈ మధ్య ప్రముఖులు సోషల్ మీడియాలో ఎకౌంట్ ని ఏర్పాటు చేసుకుని వాళ్లని ప్రమోట్ చేసుకుంటున్నారు. దీని కోసం మళ్లీ లక్షల ఖర్చు పెడుతున్నారు. అయితే ఇవన్నీ వీళ్ళ పేరు మీద నడుస్తున్నా.. నడిపించే వాళ్లు వేరే వాళ్ళు ఉంటారు.
సోషల్ మీడియా అకౌంట్ నిర్వహించడానికి నిపుణులని నియమించుకుంటారు. అలానే వాళ్ళు పబ్లిసిటీ కూడా చేస్తూ ఉండాలి. మీకు కూడా సోషల్ మీడియా పై ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా దానిపై నాలెడ్జ్ ఉంటే కచ్చితంగా ఈ పని మీరు చెయ్యొచ్చు. దీని కోసం ఎక్కువగా శ్రమ పడక్కర్లేదు కూడా. కంప్యూటర్ ముందు కూర్చుని మీరు ఆసక్తికరంగా కంటెంట్ ని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది.
ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ వంటివి మీకు వచ్చి ఉండాలి అయితే మీరు ఎవరు అకౌంట్ ని అయితే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్లకి తగ్గట్టు రాస్తూ ఉంటే సరిపోతుంది. అలానే వాళ్ళని బట్టే మీకు పారితోషికం ఉంటుంది. మంచి లాభాలను ఇలా మీరు పొందొచ్చు. అదేవిధంగా కంటెంట్ రైటర్ కింద కూడా వర్క్ చేయొచ్చు. ఇది కూడా చక్కగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. ఇలా సున్నా రూపాయలతో మీరు మొదలు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.