సిక్కింలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

-

టర్కీ, సిరియాల్లో భూకంపం ఎంతటి విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మరోవైపు ఈ దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లోనూ త్వరలో భూకంపం సంభవించే అవకాశముందని నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. మన భారత్ కూడా భూకంప ముప్పు ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున 4.15 గంటలకు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. యుక్సోమ్‌ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. యుక్సోమ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

ఆదివారం మధ్యాహ్నం అసోంలోని నాగౌన్‌ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయింది. అదేవిధంగా గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version