భారీ భూకంపం.. వణుకుతున్న భారత పొరుగు దేశాలు..

-

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీంతో భారత్‌ పొరుగున ఉన్న ఈ రెండు దేశాలు వణికిపోయాయి. బుధవారం తెల్లవారు జామున అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్ నగరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదయిందైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం ఖోస్‌కు 44 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని ప్రకటించింది. కాగా, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, దాని సమీప నగరాల్లో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత 6.1గా నమోదయింది. బుధవారం తెల్లవారుజామున 2.24 గంటల సమయంలో భూమి కంపించిందని వెల్లడించింది.

లాహోర్‌, ముల్తాన్‌, ఖ్వెట్టాతోపాలు పలు ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చిందని పాక్‌ మీడియా వెల్లడించింది. కొన్ని సెకన్లపాటు భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని, దీంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు పెట్టారని తెలిపింది. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ దేశాల్లోని 119 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపం బారిన పడ్డారని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version