వేసవికాలంలో ఆరోగ్యంతో పాటుగా అందాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. వేసవికాలంలో రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వేసవి లో ఎండ ఎక్కువగా ఉండడం వలన చర్మం పాడైపోతుంది. చర్మం పాడైపోకుండా ఉండాలంటే వేసవి కాలం లో చర్మాన్ని ఈ విధంగా కాపాడుకోండి. ట్యాన్, పిగ్మెంటేషన్, మొటిమలు, జిడ్డు వంటివి అన్నీ కూడా పోతాయి. చర్మం ఎంతో క్లియర్ గా అందంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే ఈ క్లియర్ ఫేస్ ప్యాక్స్ బాగా ఉపయోగపడతాయి.
వీటిని ఉపయోగించడం వలన అందం మరింత పెరుగుతుంది. కీరా కలబంద బాగా ఉపయోగపడతాయి. కూలింగ్ హైడ్రేటింగ్ గుణాలు వీటిలో ఉంటాయి. మీ చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. సగం కీరా ని గుజ్జు కింద చేసుకొని రసం తీసుకోండి ఇందులో కొంచెం ఫ్రెష్ గా తీసుకున్న కలబంద గుజ్జు ని మిక్స్ చేయండి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోండి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వలన చర్మం చాలా బాగుంటుంది.
బొప్పాయి తేనెతో కూడా మీరు ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు బొప్పాయిని మీరు గుజ్జు కింద చేసుకుని కొంచెం తేనె వేసి ముఖానికి మెడకి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వలన చర్మం మృదువుగా మారుతుంది. పుచ్చకాయ కూడా బాగా పనిచేస్తుంది ఇది కూడా చాలా చక్కటి ఫేస్ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. పుచ్చకాయని గుజ్జు కింద చేసుకొని అందులో పెరుగు వేసి మిక్స్ చేసి ముఖానికి మెడకి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకుంటే ఎంతో చక్కగా మీ ముఖం మారుతుంది. కమల తొక్కల పౌడర్ లో కొంచెం గంధం వేసుకుని కూడా మీరు ఫేస్ ప్యాక్ కింద వేసుకోవచ్చు.