ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై వివిధ ప్రశ్నలు లేవనేత్తుతూ లేఖ రాసింది ఈసీ. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు డీబీటీలకు నిధులెందుకు ఇవ్వలేదు ? ఇప్పటి వరకు ఇవ్వలేని ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారిగా నిధులెలా సర్దుబాటు అయ్యాయి?
ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెపుతారు? ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా ? గత ఐదేళ్లగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుండి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి. ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆలస్యమైంది. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారా వివరణ ఇవ్వండి.